రాష్ట్రంలో ఇక ఏఐ పోలీస్
బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుంది... ఏలూరులో ట్రయల్ సక్సెస్ విశాఖపట్నం: జయజయహే : పోలీస్ వ్యవస్థలో మరింత పారదర్శకత పాటించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ) పోలీస్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతికతతో ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలను అందించాలన్న చంద్రబాబు లక్ష్యాన్ని ఏపీ పోలీసులు అందిపుచ్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 'టెక్నాలజీ పోలీసుగా ఎదగడానికి అడుగులు వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకుంటోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో చార్జిషీట్ వరకూ...