Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీరామ జోగయ్య శాస్త్రి కి ఆత్రేయ పురస్కారం ప్రధానం

రామ జోగయ్య శాస్త్రి కి ఆత్రేయ పురస్కారం ప్రధానం

జయజయహే : మనసుకవి ఆచార్య ఆత్రేయ 104 వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ రచయిత రామ జోగయ్య శాస్త్రి కి రేపు ఆత్రేయ పురస్కారం ప్రధానం చేయనున్నట్టు ఆత్రేయ స్మారక కళా పీఠం ప్రధాన కార్యదర్శి గంటి మురళీ ధర్ మంగళ వారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గంటి మురళీ మాట్లాడుతూ ఈనెల 7 వ తేదీన సాయంత్రం 5 గంటలకు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సన్మానిస్తున్న రామ జోగయ్య శాస్త్రి 400 వందల చిత్రాలకు మాటలు, 1500 పాటలు రాశారన్నారు. అనంతరం ఆత్రేయ రాసిన చిత్ర గీతాలతో న్యూ రోషన్ లాల్ ఆర్కెస్ట్రా వారి నిర్వహణలో సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట రావు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?