రాత్రి పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగర మేయర్.
విశాఖపట్నం, జయజయహే : విశాఖ నగర పర్యావరణ పరిరక్షణ, సుందరికరణ దిశగా మహా విశాఖ నగరాన్ని నిత్యం పరిశుభ్రపరచడంలో రాత్రి పారిశుధ్య కార్మికుల విధుల పనితీరును మెరుగుపరచడంలో జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన నగరంలో ఆర్కే బీచ్ , జగదాంబ జంక్షన్ పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న రాత్రి పారిశుధ్య పనుల పనితీరును పరిశీలించారు. ఈ పరిశీలనలో మేయర్ ముందుగా ఆర్కే బీచ్ వద్ద ఉన్న పారిశుధ్య కార్మికుల హాజరు...