రాజ్ కసిరెడ్డి అరెస్టు లిక్కర్ స్కామ్ లో అదుపులోకి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు గత నెల రోజులుగా పరారీలో వైసీపీ నేత

జయజయహే : లిక్కర్‌ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న వైసీపీ మద్దతుదారుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారు. మార్చి నుంచి సిట్ విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న రాజ్‌ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని ఇప్పటికే నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసుకు సమాధానం చెప్పిన కసిరెడ్డి అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఆడియోలు రిలీజ్...