Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీరాజ్ కసిరెడ్డి అరెస్టు లిక్కర్ స్కామ్ లో అదుపులోకి హైదరాబాద్ నుంచి విజయవాడకు...

రాజ్ కసిరెడ్డి అరెస్టు లిక్కర్ స్కామ్ లో అదుపులోకి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు గత నెల రోజులుగా పరారీలో వైసీపీ నేత

జయజయహే : లిక్కర్‌ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న వైసీపీ మద్దతుదారుడు రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారు. మార్చి నుంచి సిట్ విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్న రాజ్‌ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. లిక్కర్ కుంభకోణంలో విచారణకు రావాలని ఇప్పటికే నాలుగు సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసుకు సమాధానం చెప్పిన కసిరెడ్డి అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు. తాను తప్పుచేయలేదని కోర్టుల్లో ఊరట లభించాక విచారణకు హాజరవుతానంటూ చెప్పుకొచ్చారు. చివరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. సిటి విచారణ ప్రారంభమైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాజ్ కసిరెడ్డి దుబాయ్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. మంగళవారం విచారణకు వచ్చేందుకు సిద్ధమై ఆయన ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు పట్టుకున్నారు. వెంటనే తెలంగాణ పోలీసులకు చెప్పి విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ లిక్కర్ స్కామ్‌లో అంతా దగ్గరుండి నడిపించింది రాజ్ కసిరెడ్డే అని ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. మొత్తం ఆయన చూసుకున్నాడని కూడా సిట్ అధికారులకు, మీడియాకు వెల్లడించారు. అందుకే కసిరెడ్డిని పట్టుకునేందుకు దాదాపు నెల రోజుల నుంచి సిట్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. హైదరాబాద్‌లో ఉన్న కసిరెడ్డి ఆఫీస్‌లు, ఇళ్లు, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. కుమారుడి ఆచూకీ తెలిస్తే చెప్పాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?