రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు–మంత్రి నారాయణ
సోమవారం అమరావతిలో 48వ సీఆర్‌డీఏ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి. నారాయణ వివరించారు. రాజధాని అమరావతిలో ఎయిర్‌పోర్ట్ సహా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34 వేల ఎకరాల భూ సమీకరణ సరిపోదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు. పెదకూరపాడు పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 24 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారని...