రక్తహీనతను అరికట్టేందుకే పౌష్టికాహారం, తల్లి బిడ్డ విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి – ఎమ్మెల్యే బండారు గర్భిణీలకు శ్రీమంతం

మాడుగుల : జయజయహే : అప్పట్లో పౌష్టికాహారం లోపించడం వల్లే రక్తహీనత అనారోగ్య సమస్యలు ఎదురయ్యేయని అవి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసిందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా శనివారం మాడుగుల ఐసిడిఎస్ పిఓ సిహెచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో పాల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా 15 మంది గర్భిణీలకు జరిగిన శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వారికి పసుపు కుంకుమలు పళ్ళు...