రక్తదానంపై అపోహాలు వీడండి – రెడ్ క్రాస్ చైర్మన్

జయజయహే : యువత రక్తదానంపై అపోహాలు వీడి రక్తదానం చెయ్యాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్ మోహన రావు సోమవారం పిలుపునిచ్చారు. నగరంలో ఒక మహిళకు స్త్రీలకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం రాగా, రక్తం తక్కువ కారణంతో శస్త్రచికిత్స వాయిదాపడుతూ వచ్చిందని, అందుకు రక్త నమూనాలో అతి తక్కువగా దొరికే ఎబి నెగెటివ్ కావడమేనన్నారు. రక్తదాత కొల్ల. లక్ష్మణ రావు ముందుకు వచ్చి రక్తాన్నందించి శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పించారని, ఆయనెప్పుడు రక్తదానం చేయటానికైనా సిద్ధపడటం హర్షణీయమన్నారు. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు ప్రచురిస్తున్న కారణంగా...