SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 6:41 am Posted by : SHIVASURYA NEWS

రక్తదానంపై అపోహాలు వీడండి – రెడ్ క్రాస్ చైర్మన్

జయజయహే : యువత రక్తదానంపై అపోహాలు వీడి రక్తదానం చెయ్యాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్ మోహన రావు సోమవారం పిలుపునిచ్చారు. నగరంలో ఒక మహిళకు స్త్రీలకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరం రాగా, రక్తం తక్కువ కారణంతో శస్త్రచికిత్స వాయిదాపడుతూ వచ్చిందని, అందుకు రక్త నమూనాలో అతి తక్కువగా దొరికే ఎబి నెగెటివ్ కావడమేనన్నారు. రక్తదాత కొల్ల. లక్ష్మణ రావు ముందుకు వచ్చి రక్తాన్నందించి శస్త్రచికిత్సకు వెసులుబాటు కల్పించారని, ఆయనెప్పుడు రక్తదానం చేయటానికైనా సిద్ధపడటం హర్షణీయమన్నారు. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు ప్రచురిస్తున్న కారణంగా కొంత మంది యువతలోనైనా మార్పు తీసుకువస్తున్నారని అందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. రక్తదాత కొల్ల. లక్ష్మణ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది. ఉమా శంకర్ అందించిన సమాచారం మేరకు వచ్చానని, ఇప్పటివరకు తొమ్మిది సార్లు రక్తమందించానన్నారు. ఎవరికి అవసరమున్నా ఎబి నెగెటివ్ కొరకు నన్ను సంప్రదించవచ్చని, ప్రతీ మూడునెలకు రక్తదానం చేస్తానన్నారు. అనంతరం రక్తదాతకు రెడ్ క్రాస్ ప్రతినిధుల బృందం, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం శివతేజ పట్నాయక్ లు ప్రశంసాపత్రంతోపాటు, బంగారు పతకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రక్తదాత కొల్ల. లక్ష్మణ రావు, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం మేనేజర్ అయేషా. బేగం, ఎపిఆర్వో నంది ఉమా శంకర్, బి.జగదీష్ పాల్గొన్నారు.