యోగాంధ్రప్రదేశ్ భేష్..ప్రధాని మోడీ
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ అనే యోగా అభియాన్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో మహిళలు డ్రోన్ ఆపరేట్ చేస్తూ వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగా మన జీవన విధానాన్ని మారుస్తుందని.. ప్రజలంతా దానిని అనుసరించాలని ప్రధాని పిలుపిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 లక్షల మంది యోగా ప్రాక్టీషనర్స్‌ను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా సంస్కృతిని అభివృద్థి చేయడం ఈ కార్యక్రమ...