SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 12:13 pm Posted by : SHIVASURYA NEWS

మ్యుటేషన్ల ప్రక్రియ జాప్యం చేస్తే ఉపేక్షించను

పివిటిజిలకు నివాస దృవ పత్రాలు

జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

పాడేరు జయజయహే : మ్యుటేషన్ ప్రక్రియ జాప్యం చేస్తే ఉపేక్షించనని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ హెచ్చరించారు. భూముల సర్వే సమ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి 22 మండలాల రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కార్ఫరెస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ కార్య క్రమాలను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. వ్యవసాయ భూములకు నీటి వినియోగం చేసే చోట నీటి పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. 26 వేల మందికి పివిటిజిలకు ఆధార్ కార్డులు జారీ చేయవలసి ఉందన్నారు. త్వరగా ఆధార్ కార్డులు జారీ చేయడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 35 వేల ఆలస్య జనన దృ వీకరణ పత్రాలు జారీ చేయవలసి ఉందని పేర్కొన్నారు అదే విధంగా చిరునామా, జనన దృవీకరణ, గుర్తింపు కార్డుతో కూడిన వివాస దృవ పత్రాలను గ్రామ సచివాలయం నుండి జారీ చేయాలన్నారు.

ప్రభుత్వ భూముల రక్షణ చర్యలు

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం జరుగుతోందని హైకోర్టు సీరియస్ గా ఉందన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమలను సర్వే చేసి రిపోర్టు సమర్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు, ఎంపిడి ఓలు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి దురాక్రమణ చేసిన భూములను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేప్టాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంత నుండి జలపాతాల వద్ద పర్యాటకులను అనుమతించ వద్దని స్పష్టం చేసారు. గ్రామస్తులతో వి ఆర్ ఓలు, మహిళా పోలీసులు చర్చంచి పర్యాటక జల పాతాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ( పర్చువల్ ) అసిస్టెంట్ కలెక్టర్ కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్, డి ఆర్ ఓ కె. పద్మలత, ఎన్డీసి ఎం. వి. ఎస్. లోకేశ్వరరావు, సర్వే సహాయ సంచాలకులు కె. దేవేంద్రుడు, 22 మండలాల తాహశీల్దారులు సర్వేయర్లు, వి ఆర్ ఓలు తదితరులు పాల్గొన్నారు.