మైనింగ్, లిక్కర్ మాఫియా తో దోచుకుంటున్నారు

కింజరాపు కుటుంబం దోపిడీ విధానాలను, అరాచక పాలన ప్రజలకు తెలియజేయండి అనుబంధ సంఘాల అధ్యక్షులకు తిలక్ పిలుపు జయజయహే : మైనింగ్ లిక్కర్ మాఫియా తో కింజరాపు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు కుటుంబం ప్రజాధనాన్ని దోచుకుంటుందని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. సోమవారం టెక్కలి వైయస్సార్ సిపి కార్యాలయంలో నియోజకవర్గ, మండల స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి సానుభూతిపరులు కు చెందిన క్రషర్లను మూసి వేయించి కూటమి ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్న...