SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 11:34 am Posted by : SHIVASURYA NEWS

మైనారిటీ స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీస్ కార్పొరేషన్ ఇడి షంసున్నిషా బేగం

పాడేరు,జయ జయహే : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ మరియు క్రిస్టియన్ మైనారిటీ కార్పోరేషన్ ద్వారా జిల్లాలో నివసించే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, భౌద్ధులు, జైనులు మరియు పార్శీకులకు స్వయం ఉపాధి పథకం ( ఎస్ ఎస్ ) అవకాశాలు కల్పించినట్లు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు షాంసున్నీష బేగం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం క్రింద, మైనారిటీ చెందిన వారికి రూ. 1.00 లక్ష నుండి 8.00 లక్షల వరకు, మరియు క్రైస్తవ మైనారిటీ చెందిన వారికి రూ. 1.00 లక్ష నుండి 5.00 లక్షల వరకు వివిధ యూనిట్ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎంపిక కాపాడిన దరఖాస్తుదారులకు 50% సబ్సిడీ మంజూరు చేయబడుతుందన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు 21 నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గలవారై, ఆంధ్రప్రదేశ్ పౌరులై మైనారిటీ వర్గానికి చెందినవారై ఉండాలని వివరించారు. అదే విధంగా దరఖాస్తు తో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ జత చేయాలన్నారు. దరఖాస్తుదారు గత ఐదేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు వినియోగించుకొని ఉండరాదని తెలిపారు. దరఖాస్తుదారు గ్రామీణ ప్రాంతంలో అయితే సంవత్సరానికి లక్ష రూపాయలు, పట్టణ ప్రాంతo వారు సంవత్సరానికి 1.50 లక్షల రూపాయలు లోపు ఆదాయం కలిగి ఉండాలన్నారు. దరఖాస్తును మే 25వ తేదీలోగా https:/ lapobmms.apdss.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఇడి విజ్ఞప్తి చేశారు.