మే 12న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం -ఆలయ కార్యనిర్వహాణాధికారి కెఎన్‌విడివి ప్రసాద్
విజయనగరం, జయజయహే : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే 12న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి, ఉప కమిషనర్ కెఎన్‌విడివి ప్రసాద్ తెలిపారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవర ఉత్సవం గురించి వివరించారు. మే 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడితల్లి అమ్మవారి వనం గుడివద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై, గంటస్థంభం మీదుగా హుకుంపేట చేరుకుంటుందని తెలిపారు. తిరిగి రాత్రి 10 గంటలకు హుకుంపేటలోని అమ్మవారి...