Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమే నెల నుండి కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ

మే నెల నుండి కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ

మాడుగుల : జయజయహే : రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి వితంతువులకు కొత్త పెన్షన్లు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు ఎన్టీఆర్-భరోసా కింద మొత్తం 89,788 లబ్ధిదారులకు వితంతవు పింఛనులు మంజూరు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీళ్ళందరికీ మే నెల నుండి పించను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వాటిలో భాగంగా మాడుగుల నియోజకవర్గానికి 709 వితంతు పెన్షన్లు మంజూరయ్య అన్నారు. వాటిలోమాడుగుల మండలానికి166, చీడికాడ మండలానికి 129,దేవరాపల్లి మండలానికి 157,కోటపాడు మండలానికి 197 పెన్షన్లు మంజూరైనట్టు తెలిపారు కాబట్టి కుటుంబ సభ్యులు నాయకులు గమనించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?