మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ…. కడప మహానాడులో సీఎం చంద్రబాబు.

రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా రూ.20 వేలు అందించే అన్నదాత సుఖీభవ పథకం అమలుపై తాజా అప్‌డేట్ వచ్చింది. కడపలో జరిగిన మహానాడు వేదికగా అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన తొలి విడత నగదు పడిన సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత సాయం అందిస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నదాత...