SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 12:22 pm Posted by : SHIVASURYA NEWS

మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న ఇసుక వ్యాపారం

పేరు గృహ నిర్మాణాలు

లారీలు పై రవాణా

పట్టించుకోని వారు కరువాయే

గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా పట్టించుకోని యంత్రాంగం

చోడవరం : జయజయహే : చోడవరం మండలంలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. గృహ నిర్మాణాల పేరుతో బళ్ళు ట్రాక్టర్ల పై రహస్య ప్రాంతాలకు తరలించి లారీలపై ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నట్టు ప్రజల విమర్శిస్తున్నారు. గతంలో ఇసుక త్రవ్వకాలు మూలంగా ఎన్నో ప్రమాదాలు జరిగిన యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండతోనే సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చోడవరం మండలంలో పెద్దేరు బొడ్డేరు శారద తదితర పరివాహక ప్రాంతాల్లో ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా అడ్డగోలుగా వ్యాపారం సాగిపోతుంది. గతంలో ఇసుక త్రవ్వకాలు మూలంగా పలుచోట్ల బ్రిడ్జిలు పడిపోవడం నది పరివాహక ప్రాంతాలు దెబ్బతినడం వంటి వాటితో పాటు నదుల్లో చేసిన గోతుల వలన పలువురు స్నానానికి దిగి మృత్యువాతకు గురవడం సంఘటనలు సంఘటనలు చోటుచేసుకున్నాయి అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం యదేచ్చగా సాగిపోతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు జరగకూడదని ప్రభుత్వాదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవేమి ఖాతర చేయడం లేదు. దీంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క నుంచి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తవ్వకాలు మాత్రం సాగిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి త్రవ్వకాలను అరికట్టకపోతే భవిష్యత్తులో అనేక ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని అందుకు అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.