:ముస్లిం మహిళలను పెళ్లి చేసుకున్న వారిని హతమార్చడమే ఉగ్రవాది సిరాజ్ లక్ష్యం
ఉగ్ర సానుభూతిపరులు సిరాజ్, సమీర్ విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నారు. ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు సిరాజ్, సమీర్‌ను ఐదవ రోజు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని ఎన్‌ఐఏ, కౌంటర్ ఇంటిలిజెన్స్ , ఢిల్లీ ఇంటిజెన్స్ బ్యూరో, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిరాజ్, సమీర్ జిహాదీలే అని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడులో...