ఉగ్ర సానుభూతిపరులు సిరాజ్, సమీర్ విచారణ కొనసాగుతోంది. ఐదవ రోజు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నారు.
ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు సిరాజ్, సమీర్‌ను ఐదవ రోజు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని ఎన్‌ఐఏ, కౌంటర్ ఇంటిలిజెన్స్ , ఢిల్లీ ఇంటిజెన్స్ బ్యూరో, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, విజయనగరం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిరాజ్, సమీర్ జిహాదీలే అని దర్యాప్తు బృందాలు నిర్ధారణకు వచ్చాయి. విజయనగరం, హైదరాబాద్, బెంగుళూరు, తమిళనాడులో భారీ పేలుళ్లకు కుట్రపన్నారని తెలుస్తోంది. తన గురించి మరచిపోవాలని జైలు దగ్గర ములాకత్‌లో తన తల్లికి సిరాజ్ చెప్పాడు.
ఇప్పటికే సిరాజ్, సమీర్‌లకు అందిన నిధులపై దర్యాప్తు బృందాలు పక్కా ఆధారాలు సేకరించాయి. ముస్లిం మహిళలను వివాహం చేసుకున్న ఇతర మతస్తులను హతమార్చాలి అన్నది సిరాజ్ పథకంలో ఓ భాగమని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అహీం అనే సంస్థతో ఉగ్ర కార్యకలాపాల విస్తృతికి సిరాజ్, సమీర్ స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేశారని దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి.
మరోవైపు ఉగ్ర లింకులతో సంబంధం ఉన్న సిరాజ్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్షా సమితి, ఏపీ సాధూ పరిషత్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పనిచేస్తోన్న సిరాజ్ తండ్రి, సోదరుడిని విధుల నుంచి తప్పించి, విచారణ జరిపించాలన్నారు. ఆ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలో పోలీస్ కార్డెన్ సెర్చ్ చేపట్టాలని అన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా మసీదులతో పాటు మదరసాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మాదరసాలకు ఎక్కడెక్కడ నుండో గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారన్నారు. ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. ఇంత జరిగినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉగ్ర లింకులు కనిపెట్టడంలో పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని శ్రీనివాసనంద సరస్వతి విమర్శలు గుప్పించారు.
Like this:
Like Loading...
Related