SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 23 April 2025, 12:04 pm Posted by : SHIVASURYA NEWS

ముగిసిన జపాన్ పర్యటన

నేడు హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్య టన మంగళవారం ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు 8 రోజులపాటు జపాన్ లో పర్యటించారు.

జపాన్ లోని ఓసాకాలో జరిగిన ఇండస్ట్రియల్ ఎక్స్ పో పాల్గొన్న అనంతరం.. వివిధ పారిశ్రామిక వర్గాలతో పలు సమావేశాలు జరిపారు. 8 రోజుల జపాన్ పర్యటనలో సీఎం బృందం తెలంగాణకు రూ. 12,062 కోట్ల పెట్టుబడులను సాధించారు.

ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 3500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా పర్యటనలో చివరి రోజున జపాన్‌లోని ప్రసిద్ధ హిరోషి మా శాంతి స్మారకాన్ని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.