Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసిన బీజేపీ నేత

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కలిసిన బీజేపీ నేత

జయజయహే : రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నామినేషన్ వేసేందుకు శాసనసభకు వచ్చిన వెంకటసత్యనారాయణ వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణకు సీఎం నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ని కలిసిన వారిలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్,ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,కామినేని శ్రీనివాసరావు, ఈశ్వరరావు, పార్థసారధి,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నేతలు ఉన్నారు.

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?