SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 7:44 am Posted by : SHIVASURYA NEWS

ముంబైలో ప్రముఖ సిద్ధి వినాయక స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్న అనకాపల్లి ఎం.పీ

అనకాపల్లి : జయజయహే : రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ అధ్యక్షతన రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెస్ట్రన్ రైల్వే స్టడీ విజిట్ మహారాష్ట్ర ముంబైలో మూడు రోజులపాటు జరుగుతున్న పర్యటనలో భాగంగా నేడు ముంబై నగరంలో ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ కార్యనిర్వాహక అధికారులు మరియు సిబ్బంది ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్ధి వినాయక ఆలయ ట్రస్ట్ వార్షిక ఆదాయాన్ని ఎక్కువ మొత్తంలో ఆడపిల్లల సంక్షేమం కొరకు వినియోగించడం ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది గొప్ప ఆలోచనని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో బేటి పడావో నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని ప్రత్యేకంగా ఆలయ ట్రస్టు సభ్యులను అభినందించారు.