SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 December 2025, 4:05 am Posted by : SHIVASURYA NEWS

మా మీద ఆరోపణలు అవాస్తవం : మల్లప్ప గౌడు

నందవరం,శివసూర్య, డిసెంబర్ 28:
నందవరం నందవరం గ్రామానికి చెందిన కారుమంచిబసవరాజుగౌడ్ మాపై చేసిన ఆరోపణలు ఆ వాస్తవమని మల్లప్పగౌడ్, చిన్న మల్లప్పగౌడ్, కుటుంబ పెద్దలు తెలిపారు.  ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఇంటి ముందు ఉన్న మా స్థలాన్ని ఆయన స్థలమంటూ శనివారం రోజున డిఎస్పి భార్గవ్ కి వినతి పత్రాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆయన పత్రిక ప్రకటన కూడా ఇవ్వటం జరిగిందన్నారు. మా ఇంటి ముందు స్థలం తనదంటూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ బండలు పాతే ప్రయత్నం చేశారన్నారు. అసత్య డాక్యుమెంటును పుట్టించి మమ్మల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 1929 సంవత్సరంలో మా పెద్దలు రామన్నగౌడ్ పూలచింత గ్రామానికి చెందిన జంబు మల్లప్ప గౌడ్
బసవరాజ్ గౌడ్ దగ్గర ఈ స్థలాన్ని కొన్నారన్నారు. సుమారుగా 96 సంవత్సరాలుగా పెద్దల కాలం నుండి ఇప్పటివరకు ఈ స్థలంలో అనుభవంలో ఉంటు నివాసం సాగిస్తున్నా మని తెలిపారు. 100 అడుగుల పొడవు గల స్థలంకు సంబంధించిన ఒరిజినల్ రిజిస్టర్ పత్రాలు ఉన్నాయని చెప్పారు. మా స్థలాన్ని తన స్థలమంటూ కారుమంచి బసవరాజుగౌడ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. 96 సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలో నివాసం ఉంటున్నామని, ఈ ప్రదేశంలో బోర్ వేసి చెట్లు పెంచుకున్నా మన్నారు. ఈ స్థలం ఆయనది అయితే అప్పుడే అడ్డుకోవచ్చు కదా అని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా మా వల్ల ప్రాణహాని ఉందని, ఆయనపై దాడి చేశామని పత్రికలో రావడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.