Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీమాస్కులు దసరించడం మంచిది... కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు.... !!

మాస్కులు దసరించడం మంచిది… కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు…. !!

సమసిపోయిందనుకున్న కరోనా వైరస్ కేసుల సమస్య మళ్లీ తలెత్తింది. సింగపూర్, హాంకాంగ్ లకే పరిమితమైందనుకున్నప్పటికీ- క్రమంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ అడుగు పెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు, నటి శిల్పా శిరోద్కర్.. ఈ కోవిడ్ కేసుల బారిన పడ్డారు.
అవే కాదు- దేశంలో 257 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కూడా. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని పేర్కొంది.

దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)అధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్‌లలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల పెరుగుదలపై చర్చించాయి. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం- ఆయా కేసుల తీవ్రత చాలావరకు స్వల్పమేనని అంచనా వేశాయి. ఆయా కేసుల్లో అసాధారణ తీవ్రత లేదని, ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లెవరూ కూడా మరణించలేదని అధికారులు పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు. సోమవారం నాటికి దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా నమోదైంది. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువేనని, వీటి తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా దేశంలో కోవిడ్-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణ కోసం బలమైన వ్యవస్థ అందుబాటులో ఉందని అధికారులు గుర్తు చేశారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు సైతం పొంచివుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పదని చెబుతున్నారు. సీజనల్, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?