Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీ మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు

 మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు

మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన బాంబులను ధ్వంసం చేశాయి.

: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని 10 ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు. కూబింగ్‌లో భాగంగా ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. అనంతరం వాటిని బలగాలు నిర్వీర్యం చేసి.. స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఆ క్రమంలో వీటిని అవి గుర్తించాయి. ఇక ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు నక్కి ఉండే అవకాశం ఉందంటూ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో బీడీఎస్‌ బృందాలతో కలిసి భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణించారు. అలాగే వందల మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?