Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమార్కెట్ కమిటీ చైర్మన్ కి సత్కారం

మార్కెట్ కమిటీ చైర్మన్ కి సత్కారం

మాడుగుల జయజయహే : మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజును శుక్రవారం దుర్గాదేవి ఆలయంలో శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అప్పలరాజును సాలువుతో సత్కరించి కూటమి ప్రభుత్వం మాడుగులను గుర్తించిందంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఎస్వీ కొండలరావు, ఏ ఎన్ వి ప్రసాద్, కె దేవుడు, జి జగన్నాధ రావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?