మానవ విలువలు కోల్పోతున్న విద్యా వ్యవస్థ
జయజయహే : ఇటీవల రెండు విషాదకర సంఘటనలు విద్యా వ్యవస్థను తలకిందులు చేస్తున్నాయి. ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం విద్యార్థిని ఓ అధ్యాపకురాలిని చెప్పుతో కొట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం, మరో ఘటనలో ఇద్దరు సోదరులు తమ తరగతిలో వేరొక విద్యార్థితో పడుతున్న గొడవను ఆపడానికి వచ్చిన ఉపాధ్యాయుడిని, చనిపోయేంత వరకు కొట్టడం. ఇంజినీరింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం, త్రాగి కాలేజీకి రావడం, చైన్ స్నాచింగ్ లకు పాలుపడటం, ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై ఆన్...