SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 9:37 am Posted by : SHIVASURYA NEWS

మానవత్వానికి మరో పేరు “వాసుపల్లి”

జనసైనికునీ భార్యకు రూ.10,000 ఆర్థిక సాయం

పార్టీలకతీతంగా ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

జయజయహే : మానవత్వానికి నిజమైన నిదర్శనం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వైయస్సార్సీపినీ అనుసరిస్తూ చేస్తున్న ఆయన సేవలో కులం మతం పార్టీలో చూడకుండా పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ చేయూతనందిస్తున్నారు. 34 వ వార్డు భూపేష్ నగర్ వాసి పెళ్లి జరిగి ఆరు నెలలకే ఫ్లెక్సీ కడుతూ పడిపోయి చనిపోయిన జన సైనికుడు కడితిరాజు (26) ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్యకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు కడితి రాజు తల్లి వెంకటలక్ష్మి కి ఉన్న ఇద్దరు కుమారులు చనిపోయారు. భార్య కడితి లావణ్య చిన్న వయసులోనే విడో కావడం వాసుపల్లి మానవత్వాన్ని కలిచివేసింది. తక్షణమే స్పందించి ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి అండగా నిలబడతానని భరోసా కల్పించారు. ఏ సహాయం కావాలన్నా తన వద్దకు రావాలని, లావణ్యకు ఉద్యోగం అవకాశం కల్పిస్తానని ధైర్యం నింపారు. వాసుపల్లి ఓదార్పుతో కన్నీటి పర్యంతమైన భార్య లావణ్య తల్లి వెంకటలక్ష్మి.. వాసుపల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సౌత్ మున్సిపల్ విభాగం అధ్యక్షురాలు మరియు 34 వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి, 29వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు, 30వ వార్డ్ అధ్యక్షులు దశమంతల మాణిక్యాలరావు, 33వ వార్డ్ అధ్యక్షులు ముత్తబత్తుల రమేష్, 35వ వార్డ్ అధ్యక్షులు ఆలూపన కనకా రెడ్డి, సౌత్ బూత్ కమిటీ మరియు 39 వ వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్, ఎర్నిమాంబ ఆలయ చైర్మన్ లండ రమణ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు లింగం శీను, సౌత్ క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు సువార్త రాజు( సుబ్రహ్మణ్యం), సౌత్ సంస్కృతం అధ్యక్షులు సూర్య నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్, వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గున్నారు.