మానవత్వం చాటుకున్న సి ఐ సతీష్.. సిబ్బంది

సి ఐ సతీష్ వరహాలుకు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఆశ్రయం కల్పించిన పెందుర్తి పోలీసులు విశాఖపట్నం జయ జయహే, కోటపాడు మండలం, కురువాడ గ్రామానికి చెందిన పేరూరు వరహాలు (వయసు 40 సంవత్సరాలు) అనారోగ్యంతో బాధపడుతూ, సంరక్షణ కొరవడి కారణంగా బస్టాండ్ ప్రాంతంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం పెందుర్తి పోలీసులకు తెలిసింది వరహాలు పరిస్థితిని గమనించిన పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ వెంటనే స్పందించి, మానవతా దృష్టితో, అతనికి తగిన సంరక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు ఇన్‌స్పెక్టర్ సతీష్...