SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 9:44 am Posted by : SHIVASURYA NEWS

మానవత్వం చాటుకున్న సి ఐ సతీష్.. సిబ్బంది

సి ఐ సతీష్

వరహాలుకు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఆశ్రయం కల్పించిన పెందుర్తి పోలీసులు

విశాఖపట్నం జయ జయహే, కోటపాడు మండలం, కురువాడ గ్రామానికి చెందిన పేరూరు వరహాలు (వయసు 40 సంవత్సరాలు) అనారోగ్యంతో బాధపడుతూ, సంరక్షణ కొరవడి కారణంగా బస్టాండ్ ప్రాంతంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం పెందుర్తి పోలీసులకు తెలిసింది

వరహాలు పరిస్థితిని గమనించిన పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ వెంటనే స్పందించి, మానవతా దృష్టితో, అతనికి తగిన సంరక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు

ఇన్‌స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో, వరహాలను విశాఖపట్నంలోని పెందుర్తి లోయలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించి, ఆయనకు అవసరమైన భద్రత మరియు ఆరోగ్య సంరక్షణ అందే విధంగా ఏర్పాట్లు చేసారు,ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోఇలాంటి ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం మన బాధ్యత మాత్రమే కాకుండా, మానవతా విధిగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా పెందుర్తి లోయలా ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్‌చార్జ్ ప్రకాష్ మాట్లాడుతూ పెందుర్తి పోలీసుల ద్వారా ఎవరైనా అనాధలు, ముసలివారు, సంరక్షణ అవసరంతో మా వద్దకు వస్తే, వారిని ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు. పెందుర్తి పోలీసుల ఈ మానవతా సేవాపరమైన చర్య పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.