SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 11:16 am Posted by : SHIVASURYA NEWS

మాడుగుల వెంకన్న కళ్యాణ మహోత్సవాలు

మాడుగుల : జయజయహే : మాడుగుల గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఈనెల 7 వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ వి వి సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 8వ తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6:00గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీమాన్ నున్న శ్రీనివాసచార్యులు (వాసు బాబు) చే నిర్వహించబడునని చెప్పారు. కాబట్టి భక్తులు యావన్మంది విచ్చేసి స్వామివారినీ దర్శించుకుని కల్యాణ మహోత్సవం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 8న జరగనున్న కళ్యాణ్ మహోత్సవంలో పాల్గొనే దంపతులు తమ పేర్లను ఆలయ అర్చకుని వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. కాగా సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజులు కాలం నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నామ మాత్రం గానే జరుగుతున్నాయి. వందలాది ఎకరాలు భూ వసతి ఉన్న అవి పరులు పాలు కావడంతో ఆలయానికి ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు. డిపాజిట్ల మీద సుమారు రెండు లక్షల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ అవి ఆలయ నిర్వహణ జీతభత్యాలు ఇతరత్రా ఖర్చులకు సరిపోతున్నాయని అధికారులు వాపో తున్నారు. ఒమ్మలి గ్రామంలో 200 ఎకరాలు భూమి ఉన్నప్పటికీ అది అన్యాక్రాంతం అయిందని, ఆ భూములు సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నప్పటికీ అప్పటి ఎమ్మార్వో రైతులకు పాస్ పుస్తకాలు జారీ చేశారని అధికారులు వాపోతున్నారు. ఇందువలన దేవునికి ఆదాయం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల విషయంపై ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.