SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 12:04 pm Posted by : SHIVASURYA NEWS

మాడుగుల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం

మాడుగుల : జయజయహే : మాడుగుల ప్రభుత్వాసుపత్రికి ఎట్టకేలకు అంబులన్స్ సౌకర్యం కల్పించారు. ఈ ఆస్పత్రికి మొదటి నుంచి కూడా అంబులెన్స్ సౌకర్యం లేక రోగులు ఇబ్బంది పడేవారు అత్యవసర పరిస్థితిలో 1o4 వాహనం కానీ, ప్రైవేట్ వాహనాన్ని కానీ ఆశ్రయించే వారు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎట్టకేలకు ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. దీనినే సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించి సద్వినియోగపరచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జి పుప్పాల రమేష్,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రంజిత్ వర్మ, ఆసుపత్రికి పాలకవర్గ సభ్యులు, కూటమ నాయకులు పాల్గొన్నారు.