మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం !
మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి రేణుక, ఆమె భర్త నీలకంఠం రూ.310 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్‌ఐసీ సిద్దమైంది. ఇప్పటికే రెండు సార్లు వేలం వేయగా.. ఇప్పుడు మూడోసారి కూడా వేలం వేయబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఈ తరహా ఘటనలో ఆమె పేరు వినిపిస్తుండడం...