మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్
వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్సార్ ఆంజనేయులుకు ఇంటెలిజెన్స్ ఛీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. వీరిలో పీఎస్సార్ ఆంజనేయులు పాత్ర కీలకంగా మారింది. పీఎస్సార్ ఆంజనేయులు మరో ఇద్దరు ఐపీఎస్ లు విశాల్ గున్నీ, కాంతి...