Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్

మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్

వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్సార్ ఆంజనేయులుకు ఇంటెలిజెన్స్ ఛీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. వీరిలో పీఎస్సార్ ఆంజనేయులు పాత్ర కీలకంగా మారింది. పీఎస్సార్ ఆంజనేయులు మరో ఇద్దరు ఐపీఎస్ లు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా సాయంతో కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే కుట్రకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ కు సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. కేసు లో భాగముగా నేడు సీఐడీ పీఎస్సార్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?