మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగంచేసుకోవాలి – డాక్టర్ కందుల నాగరాజు

విశాఖపట్నం : జయజయహే : మహిళలు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సహకారంతో 32వ వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఇ డబ్ల్యూ ఎస్ సహకారంతో 32వ వార్డు అల్లిపురం , నెరేళ్ల కోనేరు ప్రాంతంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని...