మళ్ళీ జగన్ ప్రభుత్వంలో శ్రీ యెర్నిమాంబ ఆలయాన్ని విస్తరిస్తాం!
నీల ధార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జయజయహే : శ్రీ యెర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాల్లో జీవీఎంసీ 41 వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలదార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారినీ దర్శించుకున్నారు. జ్ఞానపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందులు పట్టుకొని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు కుంకుమ బుట్టను తలపై పట్టుకుని ఆలయానికి నడిచి...