SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 8:37 am Posted by : SHIVASURYA NEWS

మళ్ళీ జగన్ ప్రభుత్వంలో శ్రీ యెర్నిమాంబ ఆలయాన్ని విస్తరిస్తాం!

నీల ధార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

జయజయహే : శ్రీ యెర్నిమాంబ అమ్మవారి జాతరోత్సవాల్లో జీవీఎంసీ 41 వ వార్డు జ్ఞానాపురంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన నీలదార యాత్రలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని అమ్మవారినీ దర్శించుకున్నారు. జ్ఞానపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పసుపు నీళ్ల బిందులు పట్టుకొని జరిగిన యాత్రలో వాసుపల్లి పాల్గొని చీర, పసుపు కుంకుమ బుట్టను తలపై పట్టుకుని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆయనతోపాటు వైసీపీ కార్పొరేటర్లు కోడిగుడ్ల పూర్ణిమ, తోట పద్మావతి, కోరుకొండ వెంకట స్వాతి దాస్, రెయ్యి వెంకటరమణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఎంతగానో కృషి చేశారన్నారు. మళ్లీ ప్రజల ఆశీస్సులతో రానున్న జగన్ ప్రభుత్వంలో పంటల తల్లి, సంతాన దేవతగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడి శ్రీ యెర్నిమాంబ అమ్మవారి ఆలయాన్ని మరింత విస్తరించే విధంగా కృషి చేస్తానని అమ్మవారి పాదాల సాక్షిగా వాసుపల్లి తెలిపారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఇక్కడి ఆలయాన్ని తొలగించే ప్రక్రియలో వాసుపల్లి గణేష్ కుమార్ అడ్డుకొని స్థానికంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. మళ్లీ వైసిపి ప్రభుత్వం లోనే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో భక్తులకు సౌకర్యార్థం అన్ని వసతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధిని అడ్డుకునే కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్థానిక అమ్మవారి ఆలయంలో శాశ్వత షెడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లండ రమణ, 41వ వార్డు వైసిపి నాయకులు వేలంగిని రావు, కుమార్, మురళి, కిషోర్ అప్పారావు, పరీష్, అర్జున్, భవాని, రవి, ప్రసన్న, శ్యామ్ బాబ్జి, ప్రసాద్, గనగళ్ళ, రామరాజు, చింతకాయల వాసు తదితరులు పాల్గొన్నారు.