SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 11:17 am Posted by : SHIVASURYA NEWS

మలేరియా,డెంగ్యూ నివారణకు చర్యలు.”దోమల మందు పిచికారి” మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం

అరకు : జయజయహే : అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలం,మాడగడ పిహెచ్సి పరిధిలో గల రవ్వలగూడ గ్రామంలో మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దోమల మందు పిచికారి మొదటి విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్య లింగం పాల్గొని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ఏజెన్సీ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో నీటి నిల్వ ఎక్కువ ఉండటం వల్ల దోమల తాకిడి ఎక్కువవుతుందని,దాని దృష్ట్యా గిరిజన ప్రజలు మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధులు బారిన పడుతున్నారని,వాటి నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లో దోమల మందు పిచికారి చేయించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే పిహెచ్సి సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు డెంగ్యూ,మలేరియా విష జ్వరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి,తగు జాగ్రత్తలు సూచించి పరిసరాలు,వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం ఎస్టి సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు కమిడి అశోక్, మడగడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కమల, వైసిపి డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, పెదలబుడు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ పల్టసింగి విజయ్ కుమార్, డి.ఎమ్.ఓ తులసి రాజ్, ఏ.ఎమ్.ఓ సత్యం , కన్సల్టెంట్ శ్రీను , హెచ్.ఈ.ఎం భద్రం ,ఎస్.యు. ఓ కుమారి ,పిహెచ్సి హెచ్.వి ముత్యాలమ్మ, ఎం.టి.ఎస్ సుజాత ,ఏ.ఎన్.ఎం తుల ,హెల్త్ అసిస్టెంట్ చిన్న ,బూర్జ కామేష్ ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.