ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులంతా ఆయన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులంతా ఆయన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో చంద్రబాబు తొలిసారి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఎన్నుకున్నారు.
మహానాడు రెండవ రోజున పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చంద్రబాబు నామినేషన్లను పలువురు నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు పార్టీ నేతలంతా మద్ధతు తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నిక
కమిటీ చైర్మన్ వర్ల రామయ్య మహానాడు వేదికపై ప్రకటించారు.
చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక.. కడపతో కలుపుకుని ఇప్పటి వరకు 25 మహానాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు జూమ్ ద్వారా మహానాడు నిర్వహించారు. ఇకపోతే ప్రతీ రెండేళ్లకోసారి పార్టీ అధినేత ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. చంద్రబాబును 12వ సారి టీడీపీ అధినేతగా మహానాడు ఎన్నుకుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణం చేయించారు.

