మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్..!!

జయజయహే : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ (ఎల్ ఓ సి ) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఏప్రిల్ 27, 28 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ సంఘటనలో, పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు లేకుండా చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ క్రమంలో వెంటనే స్పందించిన భారత సైన్యం దాడులను తిప్పికొట్టింది. కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌లో, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఈ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం రాత్రి సమయంలో...