SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 9:28 am Posted by : SHIVASURYA NEWS

మనస్పర్ధలకు తావు లేకుండా సంస్థా గత ఎన్నికలు

మాడుగుల: జయజయహే : తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ కార్యకర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఏకగ్రీవంగా కమిటీలు ఎన్నికయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. శనివారం మాడుగుల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం లో ఆయన గ్రామ కమిటీ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. మే 15వ తేదీలోగా గత ఎన్నికలు పూర్తి కావలసి ఉందన్నారు. అయితే అప్పటికి ముందుగానే మన మండలంలో ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి ఉండూరు దేవుడు మాట్లాడుతూ ఈనెల 28 నుంచి మే ఆరో తేదీ వరకు మాడుగుల మండలంలో గల 29 పంచాయతీల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు తగు కార్యాచరణ రూపొందించమని కార్యకర్తలు అందరూ సహకరించాలన్నారు. గ్రామ కమిటీ ఎన్నిక అనంతరం మండల కమిటీ ఎన్నిక ఉంటుందన్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు జేసుదాసు వచ్చినందున క్రమశిక్షణతో వ్యవహరించి ఎలక్షన్స్ లేకుండా సెలక్షన్ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్ , ఎంపీటీసీ బి శ్రీనివాస్,మాడుగుల పట్టణ పార్టీ అధ్యక్షుడు వి రంజిత్ వర్మ, ఎం ఈశ్వరరావు, కే త్రినాధరావు, జి అప్పారావు, ఎల్ కాశి బాబు వివిధ గ్రామాల చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.