Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమద్యం మత్తులో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి

మద్యం మత్తులో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి

చోడవరం : జయజయహే : మద్యం మత్తులో ఒక వ్యక్తి కాలులో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోడవరంలో వెలుగు చూసింది. అనకాపల్లి కి చెంది , చోడవరంలో ఉంటున్నాడని చెబుతున్న కుడుమి ఏసు (40) చోడవరంలో రోడ్డుపై పారవేసిన ప్లాస్టిక్ సామాగ్రిని ఏరుకొని జీవిస్తుంటాడు.అయితే ఈ నెల 15వ తేదీ సాయంత్రం భారీ వర్షం కురిసింది. కాలువలు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు కాలువలు పూడిక తీస్తుండగా ఈ మృతదేహం బయటపడింది. వెంటనే వారు గ్రామపంచాయతీకి పోలీసు వారికి సమాచారం అందించారు . ఇతడు రాత్రి మద్యం సేవించి కాలువ గట్టుపై పడుకుని కాలువలో పడిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని పరిస్థితి పరిశీలించి మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?