మత్స్యకారుల సేవలో కూటమి సర్కార్…! టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు హర్షం

జయజయహే : రాష్ట్రంలో కూటమి సర్కార్ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో నిమగ్నమై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మత్స్యకారుల నాయకుడు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. సముద్రంపై వేటచేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకారుల బృతిని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా అమలు చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం...