మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది. అయితే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల...