Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీమంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

 తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిగా సీఐడీ పోలీసులు చేర్చారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే.. 2021, అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఈ దాడి కేసును సీఐడీకి అప్పగించింది.

అయితే ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నాటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ ఆధ్వర్యంలోని వైసీపీ ముఖ్యనేతల ఆదేశాలతో ఈ దాడికి పథక రచన జరిగినట్లు సమాచారం. వందలాది మంది వైసీపీ నాయకులతో పాటు రౌడీషీటర్లు, పలువురు మహిళలు ఈ దాడిలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ప్రధాన గేటును కూల్చి లోపలకి ప్రవేశించిన అల్లరి మూకలు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు.

కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు, కార్లను, సామగ్రిని ధ్వంసం చేశారు. అరగంటకు పైగా పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. అనంతరం వారంతా పరారయ్యారు. ఈ దాడి ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో.. ఈ కేసును పక్కన పెట్టేశారు. అంతేకాకుండా..టీడీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో గతేడాది జూన్ చివర్లో ఈ దాడికి సంబంధించిన కేసు ఫైళ్లను బయటకు తీశారు.అయితే ఈ కేసు నమోదుతోపాటు.. దర్యాప్తులోనూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా అప్పటి సీఐతో పాటు ఇద్దరు ఎస్‌ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నందిగం సురేష్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో.. ఆయన నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్‌ దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం విదితమే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?