భూగోళం సమస్త జీవరాశి తో కలకాలం కళకళలాడాలి పర్యావరణ హితంగా జీవించడం మన బాధ్యత ప్రొఫెసర్ ఇయుబి రెడ్డి, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్, ఆంధ్ర విశ్వవిద్యాలయం

జయజయహే : భూగోళం సమస్త జీవరాశి తో కలకాలం కళకళలాడాలి అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఇయుబి రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మాధవధార కార్యాలయంలో మంగళవారం ధరిత్రి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర లేఖనం పోటీలలో పాల్గొన్న వారికి బహుమతి ప్రధానం అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్త జీవరాశి నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళి దే అన్నారు. ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మీదే పడుతుంది...