భారత వైమానిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడి- తిప్పికొట్టిన ఇండియా:కల్నల్ సోఫియా ఖురేషీ
జయజయహే : శుక్రవారం రాత్రి నుంచి పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఇందుకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందని చెప్పారు కల్పల్ సోఫియా ఖురేషీ. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిగిన ఘటనపై విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ద్వారా వివరించారు. హైస్పీడ్ మిస్సైల్‌తో పాకిస్తాన్ భారత్ ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడి చేయాలని భావించిందని అయితే వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ. భారత్ వైమానిక స్థావరాలపై పాక్ కన్నేసిందని చెప్పిన...