Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీభారత వైమానిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడి- తిప్పికొట్టిన ఇండియా:కల్నల్ సోఫియా ఖురేషీ

భారత వైమానిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడి- తిప్పికొట్టిన ఇండియా:కల్నల్ సోఫియా ఖురేషీ

జయజయహే : శుక్రవారం రాత్రి నుంచి పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఇందుకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందని చెప్పారు కల్పల్ సోఫియా ఖురేషీ. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిగిన ఘటనపై విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ద్వారా వివరించారు. హైస్పీడ్ మిస్సైల్‌తో పాకిస్తాన్ భారత్ ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా దాడి చేయాలని భావించిందని అయితే వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ. భారత్ వైమానిక స్థావరాలపై పాక్ కన్నేసిందని చెప్పిన ఖురేషీ.. శతృదేశ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టిందన్నారు. ఇక సిర్సా వైమానిక స్థావరాన్ని పాక్ టార్గెట్ చేయడంతో పాటు భారత్ వద్ద ఉన్న ఎస్-400 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. భారత్‌ను తన అస్త్రాలతో భయపెట్టాలని చూసిన పాక్ పాచికలు పారలేదన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, “పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దులపై నిరంతరం దాడి చేస్తోంది.అది భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి ఆయుధాలు, సంచరించే మందుగుండు సామగ్రి ఫైటర్ జెట్‌లను ఉపయోగించింది.భారత్ పాక్ కుటిల యత్నాలను తిప్పి కొట్టింది. పాకిస్తాన్ 26 కంటే ఎక్కువ ప్రదేశాలలో వాయుమార్గం ద్వారా చొరబడటానికి ప్రయత్నించింది ఉధంపూర్, భుజ్, పఠాన్‌కోట్, బతిండాలోని వైమానిక దళ స్థావరాలలో మన పరికరాలను సిబ్బందిని దెబ్బతీశారు.వారు తెల్లవారుజామున 1:40 గంటలకు పంజాబ్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని హై-స్పీడ్ క్షిపణులను ఉపయోగించారు. హాస్పిటల్స్ పాఠశాలలపై కూడా దాడి చేశారు” అని వివరించారు. ఇక సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ భారత్ పై విషప్రచారం చేస్తోందని దీన్ని ఎవరూ కూడా నమ్మొద్దని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విజ్ఞప్తి చేశారు.భారత వైమానిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసిందంటూ పాక్ చేస్తున్న విషప్రచారంలో నిజం లేదని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పారు.

                   
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?