భారత నిఘా వ్యవస్థలోకి కొత్త టెక్నాలజీ..

భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) మరో ఘనత సాధించింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ మొదటి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. దీంతో భారత సైన్యం నిఘా వ్యవస్థ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరినట్లయింది. India Stratospheric Airship Test 2025: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారతదేశ రక్షణ వ్యవస్థలకి కొత్త అస్త్రం వచ్చి చేరింది. శనివారం భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(DRDO) నిర్వహించిన స్ట్రాటోస్పిరిక్ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్ తొలి పరీక్ష విజయవంతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీతో...